Hyderabad: రికార్డులు సృష్టిస్తున్న హైదరాబాద్ రియల్టీ.. కళ్లు తిరిగే సేల్స్.. అనరాక్ రిపోర్ట్..




2022లో విక్రయాలు..

2022 సంవత్సరంలో హైదరాబాద్‌తో సహా టాప్ ఏడు నగరాల్లో రికార్డు స్థాయిలో హౌసింగ్ అమ్మకాలు, కొత్త లాంచ్‌లు జరిగాయని తాజా వివేదికలు చెబుతున్నాయి. గడచిన ఐదేళ్లుగా నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసే విషయంలోనూ హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నట్లు అనరాక్ తన తాజా నివేదికలో వెల్లడించింది. 2022లో ఏకంగా 4.02 లక్షల గృహాలు ఈ మహానగరంలో అమ్ముడయ్యాయి. దీనికి ముందు 2021లో పూర్తయిన 2.79 లక్షల ఇళ్లతో పోలిస్తే ఇది దాదాపుగా 44% ఎక్కువని తేలింది.

అత్యధికంగా పూర్తి..

అత్యధికంగా పూర్తి..

2022లో పూర్తయిన ఇళ్లలో అత్యధికంగా ముంబైలో సుమారు 1.26 లక్షల యూనిట్ల నిర్మాణం పూర్తైంది. ఇది 2021లోని 70,500 యూనిట్ల కంటే దాదాపు 80% ఎక్కువని అనరాక్ వెల్లడించింది. ఇక NCRలో 2022లో దాదాపు 86,300 యూనిట్లు పూర్తయ్యాయి. 2021లో కూడా దాదాపు అదే స్థాయిలో ఉంది.




బెంగళూరు నగరంలో..

బెంగళూరు నగరంలో..

బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో మొత్తంగా 2022లో 81,580 యూనిట్లు పూర్తయ్యాయి. 2021లో 63,870 యూనిట్లు పూర్తయ్యాయి. పూణెలో 2022లో 84,200 యూనిట్లు పూర్తవగా.. 2021లో 46,080 యూనిట్ల నిర్మాణం జరిగింది. ఇక 2022లో కోల్‌కతాలో 23,16,020 యూనిట్లు పూర్తయ్యాయి. 2022లో భారత రియల్టీ రంగంలో భారీగానే క్రయవిక్రయాలు జరిగాయి. ఇదే స్థాయిలో డెవలపర్లు సైతం కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయటంపై దృష్టి పెట్టాయి.

టాప్-7 నగరాల్లో..

టాప్-7 నగరాల్లో..

దేశంలోని టాప్ ఏడు నగరాలను గమనించినట్లయితే.. గడచిన ఐదు సంవత్సరాల్లో 2022 మంచి అభివృద్ధి నమోదైందని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి వెల్లడించారు. అలాగే 2023లో ఈ టాప్ నగరాల్లో 5.44 లక్షల యూనిట్లు పూర్తికానున్నట్లు వెల్లడైంది. ఇందులో హైదరాబాద్ లో దాదాపు 25,120 యూనిట్లు పూర్తికానున్నాయి. ఇక ఢిల్లీ-ఎన్‌సీఆర్ 2023లో గరిష్ఠంగా 1,66,850 యూనిట్లు పూర్తవుతాయని తెలుస్తోంది.




Source link

Spread the love

Leave a Comment