
కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఐటీ రంగంలోని Mphasis స్టాక్ గురించే. ఐటీ సేవల రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న స్టాక్ తన ఇన్వెస్టర్లకు 22 ఏళ్ల కాలంలో ఊహించని లాభాలను అందించింది. ఈ క్రమంలో కంపెనీ దాదాపు 20,411 శాతం రాబడిని ఇచ్చింది. బ్రోకరేజ్ సంస్థలు సైతం కంపెనీ షేర్ ధర విషయంలో బులిష్ గానే ఉన్నాయి. దీంతో కొత్త టార్గెట్ ధరగా రూ.2,450గా నిర్ణయించింది.

రూ.10 స్థాయి నుంచి..
Mphasis కంపెనీ షేర్ ధర ఒకప్పుడు కేవలం రూ.10 వద్ద ఉంది. అయితే వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ మంచి లాభాలను చూపించిన స్టాక్ ఇన్వెస్టర్ల మనసు దోచుకుంది. బుధవారం స్టాక్ ధర రూ.2.5 శాతం మేర లాభపడి రూ.2,110.55 వద్ద ట్రేడింగ్ ముగించింది. అక్టోబర్ 19, 2001లో స్టాక్ ధర రూ.10.29 వద్ద ఉంది. గత సంవత్సరం మార్చిలో స్టాక్ తన ఆల్ టైం హై అయిన రూ.3,466.40 మార్కును తాకింది. ఆ తర్వాతి కాలంలో స్టాక్ ధర పతనమై 52 వారాల కనిష్ఠమైన రూ.1,897ను తాకింది.

లక్షను కోట్లుగా మార్చి..
మల్టీబ్యాగర్ రాబడులను అందించిన ఈ ఐటీ కంపెనీ షేర్లలో ఎవరైనా ఇన్వెస్టర్ 2001లో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వారు తప్పకుండా కోటీశ్వరులుగా మారేవారు. 2007 అక్టోబర్ 5న షేర్ ధర రూ.277 ఉండగా.. అక్టోబర్ 1, 2010న రూ.631, ఆగస్టు 31, 2018న రూ.1,260, మార్చి 11, 2022న రూ.3400కి చేరువైంది.
NOTE: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ట్రేడింగ్ చేసే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.