IT News: 2023 అదుర్స్.. టెక్కీల మాటకు తిరుగులేదు.. కాళ్ల భేరానికి కంపెనీలు..!
ఐఎంఎఫ్ వార్నింగ్..

2023తో అంత ఈజీ కాదంటూ ఇటీవల ఐఎంఎఫ్ MD క్రిస్టాలినా జార్జివా “ఫేస్ ది నేషన్” పేరుతో నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ చాలా గడ్డు కాలాన్ని చూడాల్సి వస్తుందని ఆమె వార్న్ చేశారు. అనేక దేశాలు మాంద్యంలోకి ప్రవేశిస్తాయని కూడా చెప్పారు. దీనికి సరైన ఉదాహరణ ఈ వారం పాకిస్థాన్ సంక్షోభంలోకి జారుకోవటమే. దాయాది ఖర్చుల మదింపులో భాగంగా కరెంట్ పొదుపును ప్రవేశపెట్టింది.

చైనా బుసల్లో లాభం..

చైనా బుసల్లో లాభం..

డ్రాగన్ కంట్రీలో కరోనా రోజుకో రికార్డు సృష్టిస్తోంది. పుట్టింటిపైనే కక్షకట్టిన కరోనా అక్కడి ప్రజలు, వైద్య వ్యవస్థలకు సవాలుగా నిలిచింది. దీంతో శవాల దిబ్బలు పెరుగుతున్నాయి. గత రెండేళ్ల కాలాన్ని గమనిస్తే.. వేసవి ప్రారంభ సమయంలో కరోనా కేసులు దేశంలో భారీగా పెరిగాయి. పైగా జనవరిలో పెడుగల సీజన్ ప్రారంభం కావటంతో ప్రయాణాలు షురూ అవుతున్నాయి. ఇది కరోనా తేలికగా విస్తరించటానికి మార్గాన్ని సుగమం చేస్తాయి. ఈ నేపథ్యంలో టెక్కీలు భారీగా లాభపడనున్నారు.
టెక్కీలకు లాభమేంటి..

టెక్కీలకు లాభమేంటి..

చైనా కరోనా కేసుల కారణంగా భారతదేశంలో స్పైక్ భయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల ఉద్యోగులు మళ్లీ అనారోగ్యానికి గురికాకూడదని కంపెనీలు యోచిస్తున్నాయి. అసలే మాంద్యంతో గడ్డు కాలంలో ఉన్న కంపెనీల ఉత్పత్తిని ఇది ప్రభావితం చేయకుండా చూడాలని టెక్ కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. అందుకే ‘బ్యాక్ టూ ఆఫీస్’ నినాదానికి కొంతకాలం బ్రేక్ చెప్పాలని అనుకుంటున్నాయి.

కీలక నిర్ణయం..

కీలక నిర్ణయం..

ఈ నేప‌థ్యంలో ఐటీ కంపెనీలు అత్యంత కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. టెక్కీలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్లీ కొనసాగించాలని ఇండియన్ ఐటీ సేవల కంపెనీలు యోచిస్తున్నాయి. కొన్ని ప్రముఖ కంపెనీలు హైబ్రిడ్ మోడల్‌ను ప్రస్తుతం కొనసాగిస్తున్నాయి. ఈ ఆకస్మిక మార్పులకు కరోనా వైరస్ కొత్త వేరియంట్ సృష్టిస్తున్న భీబత్సమే కారణంగా నిలిచింది.
రానున్న 40 రోజులు..

రానున్న 40 రోజులు..

చైనాలో పెరుగుతున్న కొద్దీ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. ఈ పరిస్థితిలో వివిధ సలహా సమావేశాల తరువాత.. కేంద్ర ఆరోగ్య శాఖ రాబోయే 40 రోజులు దేశానికి చాలా ముఖ్యమైన కాలమని తెలిపింది. పండుగల వల్ల ప్రజల ప్రయాణాలు జనవరిలో కరోనా ఇన్‌ఫెక్షన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఐటీ కంపెనీల ఉద్యోగులు డిసెంబర్ 31, 2023 వరకు ఇంటి నుంచి పని చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇంటి నుంచి ఫుల్ టైమ్..

ఇంటి నుంచి ఫుల్ టైమ్..

ఈ సమయంలో గతంలో వారానికి 5 రోజులు కార్యాలయానికి రావాలని తప్పనిసరి చేసిన ఐటీ కంపెనీలు దానికి తాత్కాలికంగా బ్రేక్ చెబుతున్నాయి. ఇంటి నుంచి పూర్తి స్థాయిలో పని చేసేందుకు కంపెనీలు అంగీకరిస్తున్నాయి. కొన్ని టెక్ సర్వీస్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు వారానికి 2 లేదా 3 రోజులు కార్యాలయానికి రావాలని ఒత్తిడి చేస్తున్నాయి. మరికొన్ని మాత్రం ఉద్యోగులకు పూర్తి సమయం ఇంటి నుంచే పనిచేసుకునేందుకు వెసులుబాటు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మెుత్తానికి మళ్లీ వర్క్ ఫ్రమ్ హోం అనుమతితో టెక్కీలు సూపర్ సంతోషంగా ఉన్నారు.
Source link

Spread the love

Leave a Comment