Lady: ఉద్యోగం ఇచ్చిన సంగీత, మోనిక మేడమ్ ఏం చేసిందంటే ?, ఆంధ్రా నుంచి వచ్చి ?




 ఆంధ్రా టూ బెంగళూరు

ఆంధ్రా టూ బెంగళూరు

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన మోనిక అనే యువతి బెంగళూరు చేరుకుని ఏదో ఒక పని చెయ్యాలని అనుకుంది. ఆరు నెలలుగా తాను పనిచేస్తున్న ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న మోనికను బెంగళూరులోని అమృతల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు చేరుకుని కెంపాపురలో నివాసం ఉంటున్ మోనికా(30)ను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు.

 పనిమనిషిగా చేరింది

పనిమనిషిగా చేరింది

నిందితురాలు మోనిక నుంచి రూ.2.30 లక్షల విలువైన 40 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని హెబ్బాళ కెంపాపురానికి చెందిన సర్వీస్ రోడ్డులో నివాసముంటున్న సంగీత పొన్నప్ప అలియాస్ సంగీత అనే మహిళ ఫిర్యాదు మేరకు చోరీకి పాల్పడిన మౌనికను అరెస్టు చేసి చోరీ చేసిన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.




 డౌట్ రాకుండా ఏం చేసిందంటే ?

డౌట్ రాకుండా ఏం చేసిందంటే ?

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మోనిక గత సెప్టెంబర్‌లో సంగీత పొన్నప్ప ఇంటి పనిలో చేరింది. సెప్టెంబర్ 19 నుంచి జనవరి 5వ తేదీ వరకు ఆమె ఇంట్లోని సాయిబాబా బంగారు, గణపతి లాకెట్, డైమండ్ లాకెట్ సహా సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించింది. ఇంటిలో వరుసగా బంగారు నగలు మాయం కావడంతో సంగీత ఆమె ఇంటిలో పని చేస్తున్న మోనికాను ప్రశ్నించింది. అయితే మోనికా మాత్రం ఎదురు తిరిగి నాకే ఏమీ తెలీదని చెప్పింది.

 మేడమ్ కు ఎక్కడో తేడా కొట్టింది

మేడమ్ కు ఎక్కడో తేడా కొట్టింది

మోనికా మాత్రం సందేహం రాకుండా పనిచేసింది. నగలు ఒక్కొక్కటిగా మాయమవడంతో ఇంటి యజమాని సంగీతకు అనుమానం వచ్చింది. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో సంగీత ఫిర్యాదు చేశారు. పోలీసులు మోనికను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయం బయటపడిందని అధికారులు తెలిపారు. వచ్చే జీతంతో సంసారం ముందుకు సాగడం లేదని, ఇదే సమయంలో సంగీత కుటుంబ సభ్యులు తనకు చనువు ఇవ్వడంతో బంగారు నగలు చోరీ చేశానని మోనిక అంగీకరించిందని పోలీసు అధికారులు అంటున్నారు.




Source link

Spread the love

Leave a Comment