Lady: రైల్వేస్టేషన్ లో ప్లాస్టిక్ డ్రమ్ లో యువతి శవం, హాలీవుడ్ సినిమా స్ట్రైల్లో హత్య, ఎవరు ఆమె ?




బెంగళూరులో ?

బెంగళూరు నగరంలోని యశవంతపురం రైల్వే స్టేషన్‌ నుంచి ప్రతిరోజు వేలాది మంది రైళ్లలో అనేక రాష్ట్రాలకు సంచరిస్తుంటారు. ఇదే యశవంతపురం రైల్వే స్టేషన్ లో ప్లాస్టిక్‌ డ్రమ్ములో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమైంది. ప్లాస్టిక్ డ్రమ్ లో నుంచి దుర్వాసన రావడంతో క్లీనింగ్ సిబ్బంది రైల్వే అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డ్రమ్మును పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో యువతి మృతదేహం కనిపించింది.

గూడ్స్ రైలు ఫ్లాట్ ఫామ్ మీద ?

గూడ్స్ రైలు ఫ్లాట్ ఫామ్ మీద ?

యశ్వంతపురం రైల్వే స్టేషన్‌లోని గూడ్స్ ప్లాట్‌ఫారమ్‌లోని ప్లాస్టిక్ డ్రమ్ లో సుమారు 23 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైందని పోలీసులు చెప్పారు. హంతకులు సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో యువతిని హత్య చేసి ప్లాస్టిక్ కవర్‌లో సీల్ చేసి తరువాత శవాన్ని ప్లాస్టిక్ డ్రమ్ లో పెట్టి సీల్ చేశారని పోలీసులు అన్నారు. బుధవారం డ్రమ్ లో నుంచి దుర్వాసన రావడం, రైల్వే పోలీసులు వెళ్లి చూసే సరికి మృతదేహం లభ్యమైంది. హత్యకు గురైన యువతి ఎవరు ? అని యశ్వంతపురం రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు.




హత్య ఎక్కడ జరిగింది ?, ఆ యువతి ఎవరు

హత్య ఎక్కడ జరిగింది ?, ఆ యువతి ఎవరు

రైల్వే ఫ్లాట్ ఫామ్ లోని ప్లాస్టిక్ డ్రమ్ములో దుర్వాసన రావడాన్ని గమనించిన అక్కడ శుభ్రం చేస్తున్న జయమ్మ రైల్వే స్టేషన్‌లోని అధికారులకు, సాటి క్లీనింగ్ సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం పోలీసులు డ్రమ్మును తనిఖీ చేయగా మృతదేహం లభ్యమైంది. యువతి మెడకు తెల్లటి గుడ్డ కట్టి గొంతు బిగించి హత్య చేశారని పోలీసులు అంటున్నారు. ఏళ్ల మహిళని ఎక్కడో హత్య చేసి శవాన్ని ప్లాస్టిక్ డ్రమ్ లో తీసుకువచ్చి రైల్వే స్టేషన్ లో పెట్టి వెళ్లారని పోలీసులు అంటున్నారు.

హాలీవుడ్ సినిమా టైపులో ?

హాలీవుడ్ సినిమా టైపులో ?

యువతి మృతదేహాన్ని డ్రమ్ములో వేసిన తరువాత శవం నుంచి దుర్వాసన రాకుండా చూశారు. మృతదేహం కుళ్లిపోయేలా రసాయనాలు డ్రమ్‌లో వేశారని పోలీసులు చెప్పారు. రైల్వే స్టేషన్‌లో యువతి మృతదేహం కనిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజు 24 గంటలూ రైళ్ల కోసం ఎదురుచూస్తూ స్టేషన్‌లో కూర్చునే ప్రయాణికులు యువతి హత్యకు గుగరైన విషయం తెలుసుకుని హడలిపోయారు. యశవంతపురం రైల్వే స్టేషన్ లోకి కొన్ని రైళ్లు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వచ్చి వెలుతుంటాయి. యశవంతపురం రైల్వే స్టేషన్ ప్రయాికులతో నిత్యం రద్దీగానే ఉంటుంది.




Source link

Spread the love

Leave a Comment