
ఒకే ఏరియాలో లవర్స్
చెన్నై సిటీ సమీపంలోని పుజల్ ప్రాంతంలో వాణి నివాసం ఉంటున్నది, పూజల్ ఏరియాలోనే అభిషేక్ అనే యువకుడు నివాసం ఉంటున్నారు. మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న వాణి, అభిషేక్ హ్యాపీగా తిరుగుతున్నారు. ఎక్కడికి పడితే అక్కడికి ప్రియుడు అభిషేక్ తో కలిసి వెలుతున్న వాణి పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోంది.

అర్దరాత్రి లిఫ్ట్ అడిగిన యువతి
చెన్నైలోని కొడుంకయ్యూర్ ప్రాంతంలో గణేష్ కుమార్ అలియాస్ గణేష్ నివాసం ఉంటున్నాడు. గణేష్ అతని సొంత పనుల నిమిత్తం గురువారం అర్దరాత్రి చెన్నైలోని పూజల్ లోని వినాయకపురంకు వెళ్లాడు. తరువాత పని ముగించుకున్న గణేష్ బైక్ లో పుఝల్ నుంచి ఇంటికి బయలుదేరాడు. ఆ సందర్బంలో పుజల్ సమీపంలోని కతిర్వేడు ప్రాంతంలో ఓ యువతి గణేష్ వాహనం నిలిపి తనకు లిఫ్ట్ కావాలని చెప్పింది.

కత్తితో ప్రత్యక్షం అయిన ప్రియుడు
అంతరాత్రిలో ఓ యువతి సాయం కోరుతుండగా గణేష్ కుమార్ తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఆమెతో మాట్లాడుతున్నాడు. మంచి కత్తిలాంటి యవ్వనంలో ఉన్న అమ్మాయి చిక్కిందని, కచ్చితంగా లిఫ్ట్ ఇవ్వాలని అనుకున్న గణేష్ ఆమె గురించి ఆరా తీశాడు. యువతితో గణేష్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఓ యువకుడు అక్కడ కత్తితో ప్రత్యక్షం అయ్యాడు. గణేష్ ను కత్తితో బెదిరించిన యువకుడు అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్, డబ్బులు, బంగారు గొలుసు లాక్కొన్నాడు. అదే సమయంలో లిఫ్ట అడిగిన యువతి కూడా అదృశ్యమైంది.

పోలీసు కేసు పెట్టిన బాధితుడు
ఈ ఘటనతో ఆందోళన చెందిన గణేష్ కుమార్ వెంటనే సమీపంలోని పుజాల్ పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేశాడు. గణేష్ చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సంఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పుజాల్ ప్రాంతానికి చెందిన వాణిని, అదే ప్రాంతానికి చెందిన ఆమె ప్రియుడు అభినేష్ అనుమానాస్పదంగా తిరుగుతుంటే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

దోపిడీలు చేస్తున్న కిలాడీ లవర్స్ ఎంజాయ్
తన దగ్గర వాణి, అభిషేక్ మొబైల్, డబ్బు, చైన్ లాక్కెళ్లారని గణేష్ కుమార్ పోలీసులకు చెప్పాడు. రాత్రిపూట అమాయకులైన వారిని లిఫ్ట్ ఇవ్వాలని నమ్మించిన ప్రేమికులు వాణి, అభిషేక్ వారిని నిలువు దోపిడి చేసి పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రాత్రి పూట దోపిడీలు చేస్తున్న కిలాడీ ప్రేమికులు వాణి, అభిషేక్ ఇంతకాలం లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు.