Multibagger Stock: లక్షను రూ.45 కోట్లుగా మార్చిన స్టాక్.. మూడు సార్లు బోనస్ ఇచ్చిన స్టాక్..




కంపెనీ వివరాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ప్రభుత్వ రంగంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ గురించి. ఇందులో దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులు అందుకున్నారు. కేవలం లక్ష రూపాయల పెట్టుబడి కోట్లుగా మారిపోయింది.

మూడు సార్లు బోనస్..

మూడు సార్లు బోనస్..

స్టాక్ మార్కెట్‌ పెట్టుబడులు రిస్క్‌తో పాటు సంపాదనకు మంచి అవకాశాలను కలిగి ఉంటుంది. అయితే సరైన కంపెనీలను ఎంచుకోవటంలోనే పెట్టుబడిదారుల ఆదాయం ఆధారపడి ఉంటుంది. అలా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో మూడుసార్లు బోనస్ షేర్లను జారీ చేసింది. ఈ ప్రభుత్వ సంస్థ 2:1, 1:10, 2:1 నిష్పత్తిలో 3 సార్లు బోనస్ షేర్లను ఇన్వెస్టర్లకు అందించింది.




ఏడాదిలో రాబడి..

ఏడాదిలో రాబడి..

మూడు సార్లు బోనస్ షేర్లను అందించిన భారత్ ఎలక్ట్రానిక్స్ లక్షాధికారులను కోటేశ్వరులుగా మార్చింది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్లు 0.40 శాతం పెరిగి రూ.100.30 వద్ద క్లోజ్ అయ్యాయి. జనవరి 1,2022 నుంచి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ షేర్లు ఇన్వెస్టర్లకు 45,490.91 శాతం లాభాన్ని పొందారు.

లక్షను కోట్లుగా మార్చి..

లక్షను కోట్లుగా మార్చి..

1999లో ఎవరైనా ఇన్వెస్టర్ భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లలో దీర్ఘకాలం కోసం లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే వారికి 4,54,545 షేర్లు వచ్చేవి. ఆ తర్వాత 14 సెప్టెంబర్ 2015న తొలిసారిగా కంపెనీ బోనస్ షేర్లను జారీ చేసింది. ఆ తర్వాత రెండు సార్లు బోనస్ షేర్లను కలుపుకున్నట్లయితే ఇన్వెస్టర్లకు ప్రస్తుతం 44,99,994 షేర్లు ఉండేవి. సోమవారం షేర్ మార్కెట్ ధర ప్రకారం.. ఇన్వెస్టర్ల పెట్టుబడి విలువ లక్ష నుంచి రూ.45 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.73,280.53 కోట్లుగా ఉంది.




కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

1954లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రభుత్వ రంగ కంపెనీగా కొనసాగుతోంది. ఇది భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ఇది ప్రాథమికంగా గ్రౌండ్, ఏరోస్పేస్ అప్లికేషన్‌ల కోసం అధునాతన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న తొమ్మిది PSUలలో BEL ఒకటి.

Source link

Spread the love

Leave a Comment