News
oi-Mamidi Ayyappa
Padma Awards 2023: దేశంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం కొందరిని పద్మ అవార్డులతో సత్కరిస్తుంది. అలాగే ఈ సారి కూడా కేంద్రం అవార్డులను ప్రకటించింది. దేశంలోని వ్యాపార రంగానికి చెందిన ముగ్గురికి ఇందులో చోటు దక్కింది.
కేంద్రం ప్రకటించిన జాబితా ప్రకారం బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు నడుపుతున్న ఆయన సంపద రూ.1.10 లక్షల కోట్లుగా ఉంది. CA గ్రాడ్యుయేట్ అయిన బిర్లా లండన్ బిజినెస్ స్కూల్ నుండి MBA పట్టా పొందారు.

ఇక స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ దివంగత ట్రేడర్ రాకేష్ జున్‌జున్‌వాలా పరిచయం అవసరం లేని వ్యక్తి. 62వ ఏట గతేడాది ఆగస్టు 14న కన్నుమూశారు. తాజాగా ఆయన మరణం తర్వాత కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ని ప్రకటించింది. ఇదే సమయంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధా మూర్తికి పద్శభూషన్ ను ప్రకటించింది. ఆమె సమాజసేవలో భాగం కావటంతో పాటు ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలోని ట్రస్ట్‌కు ఆయన ఛైర్మన్‌గా ఉన్నారు.
ఇక చివరగా రస్నా గ్రూప్ ఛైర్మన్ దివంగత అరీస్ కంబాఠాకు పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది. కంబటా నాయకత్వంలో రస్నా గ్రూప్ తన వ్యాపారాన్ని 53 దేశాలకు విస్తరించింది.
English summary
jhunjhunwala, birla, sudhamurthy and rasna founder selected for padma awards
jhunjhunwala, birla, sudhamurthy and rasna founder selected for padma awards
Story first published: Thursday, January 26, 2023, 17:16 [IST]