క్రమంగా మార్పులు..
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కానీ నేడు మాత్రం వాటి ధరల్లో కొంత పతనం నమోదైంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 78.57 డాలర్లుగా ఉంది. WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 77 డాలర్లుగా ఉంది. ఒపెక్ దేశాలు తీసుకున్న నిర్ణయం ప్రభావంతో రికార్డు స్థాయికి పడిపోయిన క్రూడ్ ఒక్కసారిగా దాదాపు 100 డాలర్లకు పెరిగింది.

దేశీయ మార్కెట్లలో..
అయితే దేశీయ మార్కెట్లో గత ఆరు నెలలుగా పెట్రోల్-డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో నేడు సైతం భారత చమురు కంపెనీలు క్రూడ్ ధర తగ్గినప్పటికీ వాటి రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశంలో పెట్రోల్-డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగటం ఇది 230వ రోజు.

మార్కెట్లో నేటి ధరలు..
ఆదివారం కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా విక్రయిస్తున్నారు. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. కోల్‌కతాలో ఆదివారం లీటరు పెట్రోల్‌పై రూ.106.03, డీజిల్‌ను రూ.92.76గా విక్రయిస్తున్నారు. చండీగఢ్‌లో లీటర్ పెట్రోల్ రూ.96.20, డీజిల్ రూ.84.26గా లభిస్తోంది. కాగా లఖ్ నవూలో పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర లీటరుకు రూ.89.76గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి..
తెలంగాణలోని హైదరాబాద్ నగంలో నేడు లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82గా ఉంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.111.66, డీజిల్ రూ.99.43 వద్ద కొనసాగుతున్నాయి. దేశంలో తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ విక్రయించటంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

SMS ద్వారా ధరలు..
పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. ఉదయం 6 గంటలకు అప్‌డేట్ అవుతుంటాయి. ఈ క్రమంలో రోజువారీ పెట్రోల్, డీజిల్ రేటును SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP స్పేస్ పెట్రోల్ పంప్ కోడ్‌ను 9224992249కి, BPCL కస్టమర్‌లు RSPకి 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే HPCL వినియోగదారులు HPPrice అని 9222201122కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా తాజా చమురు ధరలను వినియోగదారులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.