
గంజాయి ముఠా
తమిళనాడులోని తుత్తకుడి జిల్లాలోని ఆరుముకనేరి సమీపంలోని కాయల్‌పట్నం ప్రాంతాల్లో గంజాయితో పాటు మాదకద్రవ్యాల విక్రయాలను అరికట్టాలని, అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఏడాది ఆరుముకనేరి బజార్‌లో రోడ్డును ఇరు వైపుల మూసేసిన స్థానికులు ధర్నా నిర్వహించడం కలకలం రేపింది.

సమాజ సేవకుడు, రెస్టారెంట్ యజమాని
ఆదవ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ యజమాని బాలకుమారేశన్ ఆధ్వర్యంలో ఆరోజు రోడ్డు మీద పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. బాలకుమారేశన్ ప్రముఖ రెస్టారెంట్ యజమాని. ఈ నిరసన నేపథ్యంలో కొన్ని నెలల క్రితం ఓ ముఠా బాలకుమారేశన్ నిర్వహిస్తున్న డెయిరీకి నిప్పు పెట్టారు. ఈ కేసులో పోలీసులు చర్యలు చేపట్టి కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

రెస్టారెంట్ లో దాడి
ఈ సందర్భంలో శుక్రవారం రాత్రి బాలకుమారేశన్ నడుపుతున్న రెస్టారెంట్‌లోకి ప్రవేశించిన ఓ ముఠా సభ్యులు అతన్ని చంపాలనే ఉద్దేశ్యంతో కత్తులు, మారణాయుధాలతో నరికేశారు. వెంటనే బాలమురగేశన్ ను ఆసుపత్రికి తరలించారు బాలకుమరేశన్ కు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు.

ఐపీయూలో చికిత్స
బాలకుమరేశన్ తుత్తకూడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఆరుముగనేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలకుమారేశన్‌ను ఓ గ్యాంగ్ మారణాయుధాలతో నరికిన సమయంలో ఆయన రెస్టారెంట్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీ ఇప్పుడు విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. న్యూఇయర్ వేడుకల ముందే గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయి మాకు వ్యతిరేకంగా ఎవరైన నోరు విప్పితే ఇలాగే ఉంటుందని హెచ్చరించడం కలకలం రేపింది.