
భద్రాచలం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ నెల 26న భద్రాచలంలోని రాములవారి సన్నిధి నుంచి తన పాదయాత్రను ప్రారంభించనున్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తం 99 రూరల్ నియోజకవర్గాల్లో కొనసాగనున్న పాదయాత్రను భద్రాచలం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

సీనియర్ నేతలు
అయితే రేవంత్ పాదయాత్రకు పలువురు సీనియర్ నేతలు అడ్డు తగులుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాదయాత్రపై తమకు ఎలాంటి సమాచారం లేదని కొందరు నేతలు చెబుతున్నారు. దీంతో రేవంత్ పాదయాత్రపై అస్పష్టత నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో పాదయాత్ర కోసం రేవంత్
ప్లాన్ చేస్తున్నా.. ఏదో ఒక అవాంతరంతో వాయిదా పడుతోంది.

దిగ్విజయ్ సింగ్
రేవంత్ రెడ్డికి సీనియర్లు సహకరించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి అసమ్మతి నేతలతో చర్చించారు. పీసీసీ చీఫ్ వర్గం నాయకులతో పాటు సీనియర్లతో వరుస భేటీలు నిర్వహించారు.నేతలంతా కలిసి పనిచేయాలని కోరారు. అయినా కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేనట్లుగా కనిపిస్తోంది.