కుక్కర్ బాంబుతో డొంక కదిలింది
ఇటీవల మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు తరువాత దేశం మొత్తం కర్ణాటక వైపు చూసింది. కుక్కర్ బాంబు పేలుడు కేసు ఎన్ఐఏ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కుక్కర్ బాంబు పేలుడు నిందితుడు మోహమ్మద్ షారిక్ అలియాస్ షారిక్ కు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకోవడంతో అతన్ని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి బెంగళూరుకు పిలుచుకుని వచ్చి విచారణ చేస్తున్నారు.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ?
కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిన బాంబు పేలుడు కేసు, మతఘర్షణల కేసులకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు బుధవారం మంగళూరులోని హీరా కాలేజ్ సమీపంలో అబ్దుల్ రెహమాన్, దావరణగెరె జిల్లాలోని హోన్నాళి తాలుకాలెని దేవనాయకనళ్లిలో నివాసం ఉంటున్న నదీమ్ అహమ్మద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

లీక్ చేసిన నిందితులు
మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు కేసు ప్రధాన నిందితుడు మోహమ్మద్ షారిక్ అలియాస్ షారిక్ తో నిందితులు ఇద్దరు నిత్యం టచ్ లో ఉన్నారని ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది. ఇప్పటికే ఇదే కేసులో షారిక్ తో సంబంధాలు ఉన్న నలుగురిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి విచారణ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

ఐసీస్ రిక్రూట్ మెంట్ !
భారతదేశంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (ఐసిస్) కార్యకలాపాలు విస్తరించడానికి నిందితులు ప్రయత్నించారని, మజిన్, నదిమ్ ఐసిస్ కార్యకపాలకు రిక్రూట్ మెంట్ చేసుకున్నారని ఎన్ఐఏ అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. శిమొగ్గ జిల్లాలోని తుంగా నది తీరంలో నిందితులు ప్రయోగాత్మకంగా బాంబు పేలుడు నిర్వహించాని అధికారులు అంటున్నారు.

ఆగస్టు 15వ తేదీన ఏం చేశారంటే ?
ఆగస్టు 15వ తేదీన శివమొగ్గలో సావర్కర్ ఫోటోలును తగలబెట్టిన నిందితులు ఆ రోజు శివమొగ్గలో మతఘర్షణలు జరగడానికి కారణం అయ్యారని, నిందితులు పలు చోట్ల విధ్వంసాలు చెయ్యడానికి ప్లాన్ వేశారని సమాచారం ఉందని, నిందితులను విచారణ చేస్తున్నామని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. మొత్తం మీద కర్ణాటకలో ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఇద్దరు అరెస్టు కావడం కలకలం రేపింది.