Ticket Refund: విమాన ప్రయాణికులకు ఊరట.. DGCA తాజా నియమాల ప్రకారం..




సవరించిన రూల్స్..

సవరించిన రూల్స్..

విమాన ప్రయాణీకుల కోసం DGCA కొత్త నియమాలను తెస్తోంది. వీటి ప్రకారం బోర్డింగ్ తిరస్కరించబడినా లేక రద్దు, విమానాల ఆలస్యం అయినప్పుడు రీయింబర్స్ మెంట్ కు సంబంధించిన నిబంధనలను సవరించబడ్డాయి. వీటి ప్రకారం ఇప్పుడు దేశీయ విమాన టిక్కెట్‌ల ధరలో గరిష్ఠంగా 75% మెత్తాన్ని ప్రయాణీకులకు రీయింబర్స్ చేయాలని విమానయాన సంస్థలను ఆదేశించింది.

అంతర్జాతీయ ప్రయాణాలు..

అంతర్జాతీయ ప్రయాణాలు..

విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు ఇదే సమస్య ఎదురైతే డౌన్‌గ్రేడ్ చేయబడిన అంతర్జాతీయ ఫ్లైయర్‌ల కోసం దూరాన్ని బట్టి రీయింబర్స్‌మెంట్ మొత్తం మారుతుందని డీజీసీఏ వెల్లడించింది. 1500 కిమీ లోపు ప్రయాణించే విమానానికి 30 శాతం, 1500-3000 కిమీ మధ్య ప్రయాణించే విమానానికి 50 శాతం, 3500 కిమీ కంటే ఎక్కువ ప్రయాణించే విమానాల విషయంలో 75 శాతం తిరిగి చెల్లించబడుతుందని డీజీసీఏ ప్రకటించింది.




ఫిబ్రవరి నుంచి..

ఫిబ్రవరి నుంచి..

తాజాగా సవరించిన రూల్స్ ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వస్తాయని తెలుస్తోంది. రిఫండ్ అమౌంట్ పన్నులతో సహా టిక్కెట్ ధర ఆధారంగా ఉంటుంది. ఇటీవల బెంగళూరు నుంచి గో ఫస్ట్ విమానం బోర్డింగ్ కోసం వేచి ఉన్న 50 మంది ప్రయాణికులను విడిచి వెళ్లిపోయింది. ఇలాంటి సందర్భంలో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతారు. అందుకే భారత పౌర విమానయాన రంగం పేలవమైన సేవలపై పరిశీలనలో ఉంది.

స్ట్రిక్ట్ యాక్షన్.. గతంలో

స్ట్రిక్ట్ యాక్షన్.. గతంలో

గత నెలలో ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులు తాగి తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేయటం పెద్ద వివాదానికి కారణమైంది. దీనిపై రెండు సార్లుగా కంపెనీ రూ.40 లక్షల మెుత్తం జరిమానా పడింది. తాజా రూల్స్ కి ముందు డీజీసీఏ పై కారణాలతో ఇబ్బందిని ఎదుర్కొన్న ప్రయాణికులకు 100 శాతం అమౌంట్ రిఫండ్ తో పాటు తరువాతి విమానంలో ఉచితంగా ప్రయాణ టిక్కెట్టును విమాన సంస్థలు అందించాలని భావించింది.




Source link

Spread the love

Leave a Comment