TS KGBV Recruitment 2023: ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్‌ఎఎస్)లోని ఖాళీలను భర్తీ చేయనుంది.
ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
TS KGBV Recruitment Updates: ఓవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నడుస్తుండగా మరోవైపు కొత్త నోటిఫికేషన్లపై ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్.
ఇందులో భాగంగా ఉద్యోగ అభ్యర్థులకు మరో అలర్ట్ ఇచ్చింది.
రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్‌ఎఎస్)లోని ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది.
మొత్తం 1241 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
శనివారం సమగ్ర నోటిఫికేషన్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది.
ఈ 1,241 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వివరాలను పేర్కొంది.కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్ -42,, పీజీసీఆర్‌టీ -849, సీఆర్‌టీ -273, పీఈటీలు -77 ఉద్యోగాలు ఉండగా….
అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్పెషల్ ఆఫీసర్, సీఆర్‌టీల ఖాళీలను తాత్కాలిక పద్ధతిన భర్తీ చేయనున్నారు.
జులైలో రాత పరీక్ష…
అభ్యర్థుల అర్హత, రాత పరీక్షా విధానం, పరీక్ష సిలబస్, అభ్యర్థుల ఎంపిక విధానం తదితర వివరాలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్ శనివారం (జూన్ 17) విడుదల చేస్తామని ప్రకటించారు.
పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ https://schooledu. telangana.gov.in వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నెల 25 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
జూన్ 26 నుంచి వచ్చే నెల 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా…. అభ్యర్థులకు వచ్చె నెలలో(జులై) ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.
TSCHE Latest News: డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి.
శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి తొలి విడుత సీట్ల కేటాయింపులు చేసింది.
ఫస్ట్ ఫేజ్ లో భాగంగా మొత్తం 73,220 మంది సీట్లు కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు.
ఇందులో 44,113 మంది అమ్మాయిలు, 29,107 మంది అబ్బాయిలు ఉన్నారు.
దోస్త్ లో వెబ్ ఆప్షన్ల ఆధారంగా… రాష్ట్రంలోని ఉస్మానియా వర్శిటీ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తున్నారు.
దోస్త్‌లో మొత్తం 889 కళాశాలలు ఉండగా… మొత్తం సీట్లు 3,56,258 ఉన్నాయి. ఇక ఇవాళ్టి నుంచే రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. జూన్ 27 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకశం ఉంది.
TS KGBV EXAM