చీపురు
హిందూ మతంలో చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవడం మంచిది కాదట.

పసుపు
వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత పసుపును ఎవరికీ దానం చేయకూడదు. పసుపు నేరుగా దేవగురు బృహస్పతికి సంబంధించినదని నమ్ముతారు. బృహస్పతి గ్రహం సంపదకు కారకంగా పరిగణినిస్తారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత పసుపును ఎవరికీ ఇవ్వొద్దట.

స్నానం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత ఎవరూ స్నానం చేయకూడదని చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్మకం.

దానం
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, సాయంత్రం దానం చేయకూడదట. ముఖ్యంగా పాలు-పెరుగు, పంచదార, పసుపు మొదలైన వాటిని దానం చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని ప్రజలు నమ్ముతున్నారు.
Note: ఈ వార్త కేవలం వాస్తు నిపుణులు అభిప్రాయాల ప్రకారం ఇచ్చాం.