బిలియన్ డాలర్ల టాక్స్..
ఈ డీల్ పూర్చి చేయటానికి వాల్‌మార్ట్ పై భారత ప్రభుత్వం 1 బిలియన్ డాలర్ల టాక్స్ భారాన్ని మోపింది. అంటే మన కరెన్సీ ప్రకారం చెల్లించాల్సిన టాక్స్ మెుత్తం దాదాపూగా రూ.8,000 కోట్లకు పైగానే ఉంది. ఒక కంపెనీని అతికించుకోవటం కంటే వదిలించుకోవటం చాలా కష్టంగా మారుతుందని చెప్పుకోవటానికి ఇదొక ఖరీదైన ఉదాహరణ.

ఫోన్ పే పెట్టుబడులు..
స్వదేశీ పేమెంట్ కంపెనీగా మారేందుకు అవసరమైన నిధులను ఫోన్ పే జనరల్ అట్లాంటిక్, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీతో పాటు మరింత మంది ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 12 బిలియన్ డాలర్ల ప్రీ మనీ వాల్యుయేషన్ నిధులను సేకరిస్తోంది. ఇవి కంపెనీని అగ్రగామిగా నిలిపేందుకు, వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా నడిపేందుకు, విస్తరించేందుకు వినియోగించాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో 2016లో కంపెనీ ఫ్లిప్ కార్ట్ గూటికి వచ్చి చేరింది. తాజాగా సొంత కుంపటి పెట్టుకోవాలని నిర్ణయించింది.

2020 నాటికి..
ఫిన్‌టెక్ సంస్థ ఫోన్ పే విలువ డిసెంబర్ 2020 చివరి నాటికి 5.5 బిలియన్ డాలర్లుగా ఉందని వెల్లడైంది. టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్‌తో సహా పెట్టుబడిదారులు ఇప్పుడు భారతదేశంలో PhonePe షేర్లను కొత్త ధరకు కొనుగోలు చేశారు. తాజా వాల్యూయేషన్ల ప్రకారం వాల్ మార్ట్ భారత ప్రభుత్వానికి దాదాపుగా రూ.8,000 కోట్ల టాక్స్ ప్రభావానికి గురైనట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అయితే ఈ భారీ మెుత్తంలో కొంత భాగాన్ని వాల్ మార్ట్ ఇప్పటికే చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుండి PhonePeని వేరు చేయడాన్ని గత నెలలో పూర్తి చేసినట్లు వాల్‌మార్ట్ వెల్లడించింది.

ఫోన్ పే ఫౌండర్స్..
ఫోన్‌పేని మాజీ ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్‌లు సమీర్ నిగమ్, రాహుల్ చారి, బుర్జిన్ ఇంజనీర్ స్థాపించారు. 2016లో సచిన్, బిన్నీ బన్సల్ స్థాపించిన కంపెనీ ద్వారా ఫోన్ పేను 2018లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేయబడింది. ఆ తర్వాత అమెరికా దిగ్గజ రిటైల్ కంపెనీ వాల్‌మార్ట్.. ఇండియాలోకి అడుగుపెడుతూ ఈ కామర్స్ దిగ్గజమైన ఫిప్ కార్ట్ ను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలులో భాగంగా ఫోన్‌పే వాల్ మార్ట్ గూటికి చేరుకుంది. కానీ తాజాగా కంపెనీ నుంచి ఫోన్ పే విడిపోయి ప్రత్యేక కంపెనీగా అవతరించింది.