ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం..ఒక్కసారైన దర్శించాలి.. – Tv9 Telugu

పవిత్ర కార్తీక మాసంలో ప్రపంచంలోకెల్లా ఎత్తైన మహా శివలింగం భక్తులతో కిటకిటలాడుతోంది

ఆ ముక్కంటికి ఎంతో ప్రీతికరమైన కార్తీక సోమవారం పురస్కరించుకుని విశేష పూజాది కైంకర్య ాలు నిర్వహించారు అక్కడి పూజారులు

కేరళ రాజధాని తిరువనంతపురంలోని చెంగల్‌ మహేశ్వర శివపార్వతి ఆలయ ప్రాంగణంలో ఈ భారీ లింగాన్ని ప్రతిష్టించారు

ఇప్పటికే ఇండియా రికార్డ్స్‌ ఆసియా రికార్డ్స్‌లో స్థానం సంపాధించుకుంది

దేవాలయ మఠాధిపతి మహేశ్వరానంద స్వామి అక్కడ తొలిపూజ చేశారు

వారణాసి బద్రినాథ్‌ గంగోత్రి గోముఖ్ రామేశ్వరం ధనుష్ ‌కోటి సహా పలు హిందూ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన మట్టి జలాన్ని  శివలింగ నిర్మాణంలో వినియోగించారు

రూ 10 కోట్ల వ్యయంతో 111 అడుగుల ఎత్తులో ఎనిమిది అంతస్థులుగా దీన్ని నిర్మించారు

తొలి అంతస్తులో 108 శివలింగాలు 8వ అంతస్తులో కైలాస నమూనాను ఏర్పాటు చేశారు