బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోన్న షారుఖ్‌.. పఠాన్‌ 2వ రోజు ఎన్ని కోట్లు కలెక్ట్‌ చేసిందంటే? – Tv9 Telugu

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది

మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్‌లోనూ కొత్త రికార్డులు నమోదు చేస్తోంది

స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమాలో దీపికా పదుకొణె జాన్‌ అబ్రహం కీలక పాత్రలు పోషించారు

మొదటి రోజు రూ106 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన ఈ సినిమా రెండో రోజు జోరును కొనసాగించింది

రెండో రోజు కూడా పఠాన్‌కు రూ 100 కోట్లకు పైనే గ్రాస్ వచ్చిందంటున్నారు ట్రేడ్ నిపుణులు

రూ200 కోట్ల క్లబ్‌లో పేరిన పఠాన్‌  ఈ వీకెండ్‌కు రూ 400 కోట్లు వసూల్‌ చేసే అవకాశం ఉందట

పఠాన్  సినిమాను సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా యష్‌ రాజ్‌ సంస్థ  నిర్మించింది