చెక్క వంట సామాను జిడ్డు ఇలా వదిలించేయండి

మోడ్రన్ కిచెన్ లో ఇప్పుడు అందరూ చెక్క వంట సామాను ఉపయోగించుకునేందుకు ఎక్కువగా ఇష్టం చూపిస్తున్నారు

చూసేందుకు చక్కగా ఉన్నప్పటికీ అవి దుమ్ము ధూళి నూనెని గ్రహిస్తాయి సాధారణ వంట పాత్రలు తోమినట్టు వాటిని క్లీన్ చేస్తే సరిపోదు

ఇంట్లోని చెక్క వంట సామాను శుభ్రం చేసేందుకు ఈ చిట్కాలు పాటించారంటే వాటికున్న నూనె చిటికెలో వదిలించుకోవచ్చు

చెక్క వంట సామానుని గోరువెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం వేసి నానబెట్టాలి 20 నిమిషాల తర్వాత వాటిని క్లీన్ చేస్తే సరిపోతుంది

వంట సామాను డిష్ లిక్విడ్ తో కడిగిన తర్వాత దాని మీద కొద్దిగా ఉప్పు వేసి నిమ్మకాయతో రుద్దాలి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి

నూనె ఎక్కువగా ఉన్న ప్రదేశంలో బేకింగ్ సోడాని చిలకరించి దానిపై నిమ్మరసం వేసుకుని రుద్దితే జిడ్డు పోతుంది

నూనె మరకలు వాసన వదిలించుకోవడానికి చెక్క సామాను వెనిగర్ లో నానబెట్టాలి

రఫ్ గా ఉండే శాండ్ పేపర్ ని చెక్క వంట సామాను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇది బ్యాక్టీరియాని తొలగిస్తుంది

గోరువెచ్చని నీటిలో డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి పాత్రలు నానబెట్టుకోవాలి గోరువెచ్చని నీరు బ్యాక్టీరియాని చంపుతుంది