కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది విద్యుత్ రంగంలోని కంపెనీ గురించే. ఒకప్పుడు ఈ షేర్ మార్కెట్లో మంచి గిరాకీతో మంచి పేరును కూడా సంపాదించుకుంది. 2007లో స్టాక్ గరిష్ఠంగా రూ.136.05 ధర వద్ద ఉంది. అవును మనం మాట్లాడుకుంటున్నది Jaiprakash Power Ventures Limited స్టాక్ గురించే. అప్పట్లో స్టాక్ రూ.28.60 రేటు స్థాయి నుంచి పెరిగి ఇన్వెస్టర్లకు కాసులు కురిపించింది.

పేదవారైన ఇన్వెస్టర్లు..
ఒకప్పుడు మార్కెట్లు వెలిగిన ఈ రిచ్ మేకింగ్ స్టాక్ చాలా మంది ఇన్వెస్టర్లను పేదవారిగా కూడా మార్చేసింది. జేపీ గ్రూప్ కు చెందిన పవర్ కంపెనీ.. డిసెంబర్ 2007లో ఉన్న గరిష్ఠ స్థాయి రూ.136.05 నుంచి ఏకంగా 76 శాతం పతనమై ఈరోజు మార్కెట్లో దాదాపు రూ.7.35 వద్ద కొనసాగుతోంది. ఎవరైనా ఇన్వెస్టర్ ఆ సమయంలో కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దాని ధర దాదాపుగా రూ.5,400కు చేరుకుంది.

రూ.2 దిగువకు స్టాక్..
22 ఏప్రిల్ 2005న జేపీ పవర్ రూ. 30.75 వద్ద ఉంది. అయితే ఆ తర్వాత 28 డిసెంబర్ 2007 నాటికి స్టాక్ ధర పెరిగి రూ.136.05 వద్దకు చేరుకుంది. ఇంత ఎత్తుకు చేరుకున్న తర్వాత 2009 మార్చి 20న రూ.27 స్థాయికి దిగజారింది. అలా ఆ తర్వాత స్టాక్ ఏకంగా రూ.2 కంటే దిగువకు దిగజారింది. ప్రస్తుతం స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.11.15 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.5.45 వద్ద ఉంది.

హైరిస్క్ జోన్..
కంపెనీ షేర్లు మింట్‌జెనీ రిస్క్ మీటర్ ప్రకారం శాతం వద్ద హై రిస్క్ జోన్‌లో ఉన్నాయి. సెప్టెంబర్ 30, 2022తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.75.42 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింద ఆర్థిక ఫలితాల్లో వెల్లడించింది. అయితే కంపెనీ క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.1.42 కోట్లు నష్టపోయినట్లు వెల్లడించింది. 1994లో స్థాపించబడిన కంపెనీ ప్రస్తుతం దాదాపుగా 1,942 మంది ఉద్యోగులను కలిగి ఉంది.